WNP: ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రీడలకు, విద్యకు వనపర్తి జిల్లా ఎంతో ప్రసిద్ధిచెందిందని DSP వెంకటేశ్వర్లు అన్నారు. సేపక్ తక్రా క్రీడా విజేతలకు సోమవారం ఆయన బహుమతులు ప్రధానంచేసి మాట్లాడారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభనుకనబరచడం అభినందనీయమన్నారు. క్రీడలలో పట్టుదలతో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.