PPM: తెలుగు సాహిత్యానికి ఉన్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గురజాడ వెంకట అప్పారావు అని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది కొనియాడారు. తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ అని అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంఘ సంస్కర్త గురజాడ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి.