SRPT: దసరా సెలవుల్లో ఎక్కువ రోజులు ఊళ్ళకు, దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో కోరారు. ఇళ్లల్లో చోరీలను అరికట్టడానికి పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా ఊరికి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.