కడప: ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్‌ను జిల్లా రాజకీయ నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రవీంధ్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా ఉన్నారు.