NRML: భైంసా రూరల్ పరిధిలోని మాటేగాం సమీపంలో ఎడ్లబండి వాగు దాటుతుండగా 65ఏళ్ల వృద్ధ మహిళ లక్ష్మీ భాయి, ఎద్దు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ క్రమంలో సురేష్, మరో ఎద్దు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటన స్థలాన్ని సందర్శించి తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు వర్షంలో వాగులు దాటరాదని హెచ్చరించారు