KRNL: స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ పథకం మహిళలకు ఆరోగ్య సంజీవని లాంటిదని MP నాగరాజు తెలిపారు. సోమవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య రక్షణకు ఈ పథకం సంజీవనిగా నిలుస్తుందని, రక్తపోటు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.