PDPL: బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలు, ప్రజల భద్రతకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్తోపాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.