NGKL: కల్వకుర్తి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రేపు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంగళవారం ఉదయం 11:30 కు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, పార్టీ నాయకులు హాజరు కావాలని తెలిపారు.