పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో పవన్ తనయుడు అకీరా నందన్ కనిపించనున్నట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ‘OG’ ఆధారంగా చేసిన గేమ్‌లో ఒక కత్తిలో ఓ యువకుడి కళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆ కళ్లు అకీరావేనని, మేకర్స్ హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.