AP: ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో వింతఘటన జరిగింది. ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్ల లక్ష్మీనారాయణ(25) తన భార్యతో గొడవ పడ్డాడు. చికెన్ తినాలని ఉందని చెప్పినా.. ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మీనారాయణ మనస్థాపానికి గురై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.