KKD: సామర్లకోట పట్టణ పరిధి 13వ వార్డు బలుసుల పేటలో ఒక పెంకుల ఇల్లు కుప్పకూలగా, అందులో నివాసం ఉంటున్న మూడు కుటుంబాలు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు ఇల్లు కూలినట్లు బాధితులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు పరిశీలించారు.