ADB: రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సేవలశాఖ మంత్రి వాకటి శ్రీహరిని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సిబ్బంది లేక క్రీడాకారులు ఆటల్లో రాణించలేకపోతున్నారన్నారు. క్రీడా ప్రాంగణంలో మౌలిక వసతులను కల్పించాలని కోరారు.