GNTR: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతిఒక్కరికి అందేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కూటమి ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.