WGL: వర్ధన్నపేట పట్టణ శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రున్ని వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.