KRNL: ఎమ్మిగనూరు వైసీపీ ఇంఛార్జ్ బుట్టా రేణుక బుధవారం తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణను జగన్ వారికి వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు ఆమె తెలిపారు.