ప్రకాశం: మార్కాపురం ఏరియాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తోట శ్రావణ్(32) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల భార్యతో విడిపోయి అదే నగరంలో తన తాత వద్ద ఉంటున్నాడు. ఏమైందో ఏమో కానీ నిన్న మధ్యాహ్నం అతని తాత బయటకు వెళ్లి వచ్చేలోపే ఉరేసుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే శ్రావణ్ ఉరేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు.