WGL: వరంగల్ MGM ఆసుపత్రి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని వరంగల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా నిలిచి 2నెలల పాప మృతి చెందిందని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలో నిజంలేదని ఖండించారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు ప్రచురించాలని కోరారు. MGM ఆసుపత్రికి పోతన సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగుతుందన్నారు.