MBNR: మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లికి చెందిన సూర్యప్రకాష్‌కు పోలీసులు పోగొట్టుకున్న ఫోను అప్పగించారు. జడ్చర్ల వెళ్లినప్పుడు తన ఫోన్ పోయిందని సూర్య ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు సూచనల మేరకు కానిస్టేబుళ్లు నరేందర్, రవికుమార్.. సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అందజేశారు. పోలీసుల పనితీరును సూర్యప్రకాష్ అభినందించారు.