ADB: జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు, పశువుల కోసం తాగునీరు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్నింగ్ మిల్లులకు 15 అక్టోబర్‌లోగా నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.