TG: సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం(NOC) ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ అంగీకరించారు. రాయ్‌పూర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. నష్ట పరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కాగా, 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.