ELR: క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా జంగారెడ్డిగూడెంకి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం స్థానిక పొగాకు బోర్డును పరిశీలించారు. రైతుల దగ్గర నుంచి పొగాకు ఉత్పత్తులు, ఎగుమతులు, కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయానే వాటిని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు వివరించారు. సుమారు 3000 మంది రైతుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.