E.G: శరన్నవరాత్రులను పురస్కరించుకొని చోడవరం దుర్గమ్మ 4వరోజు గురువారం కాత్యాయనీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువ జామునే అర్చకులు శివకుమార్ శర్మ, రమేష్ తదితరులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భవానీ భక్తులు ఎక్కువగా సంఖ్యలో వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటున్నారు.