అగ్ని ఫ్రైమ్ క్షిపణిని DRDO విజయవంతంగా పరీక్షించింది. తొలిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ నుంచి దీన్ని పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా అగ్ని ఫ్రేమ్‌ను రూపొందించారు. దీని ద్వారా క్షిపణులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తక్కువ సమయంలో తరలించే అవకాశం ఉంటుంది.