SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట (ఈశ్వరపురం) లో దేవి నవరాత్రి వేడుకలు నాలుగో రోజైన గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని లలితా పరమేశ్వరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరిపించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సంగారెడ్డితో పాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.