VSP: స్వచ్చోత్సవ్లో భాగంగా పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొని కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి పరిసరాలను శుభ్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్, సిబ్బంది పాల్గొన్నారు.