MBNR: జడ్చర్ల శాసనసభ్యులు జనం పల్లి అనిరుధ్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హంపిలో ఉన్న విరుపాక్ష దేవాలయాన్నీ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు హంపి క్షేత్ర చరిత్రను, ప్రత్యేకతను వివరించారు. తుంగభద్ర నదిని ఆయన సందర్శించారు.