కోనసీమ: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా విడుదలైన కారణంగా చాలామంది అభిమానులు, థియేటర్ యాజమాన్యం ఏ విధమైన అల్లర్లు గొడవలు జరగకుండా సహకరించారని రాజోలు సీఐ నరేష్ కుమార్ గురువారం తెలిపారు. కొంత మంది అల్లర్లు చేస్తూ బైక్ సైలెన్సర్లు ఊడదీసి శబ్ద కాలుష్యం చేస్తూ గొడవలకు పాల్పడ్డారన్నారు. అట్టి వారిని సీసీ కెమెరాలు ద్వారా గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.