SKLM: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎంటీఎస్ ఉపాధ్యాయులను తక్షణమే రెగ్యులర్ చేయాలని 98 ఎంటీఎస్ ఉపాధ్యాయుల అసోసియేషన్ సభ్యులు కోరారు. గురువారం విజయవాడలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలుసుకుని నివేదించారు. వారిని రెగ్యులర్ చేయడంతో పాటు 62 సంవత్సరాల పదవీకాలంతో పాటు ఏడాదిలో 12 నెలలు కొనసాగే దిశగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.