HYD: ఉస్మానియా మెడికల్ కాలేజీ నాలుగోసారి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) గుర్తింపును సాధించింది. ISO 9001–2015 సర్టిఫికేషన్‌ను ఆ సంస్థ ప్రతినిధి శివయ్య, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావుకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. కాలేజీలో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.