MDK: జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 26వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని మెదక్ జిల్లా ఇంటర్ అధికారి మాధవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఉన్న వసతులు విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులకు వివరించాలని చెప్పారు. కళాశాల అభివృద్ధికి సూచన సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు.