SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వెనక భాగంలో ఉన్న పార్కులో గురువారం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పార్కులో ఉన్న చెత్తను పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, విద్యానగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.