HNK: ములకనూరు బ్యాంక్ సభ్యులకు దసరా బోనస్ కింద రూ.3 కోట్ల 70 లక్షలు పంపిణీ చేయనున్నట్లు బ్యాంకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బోనస్‌ను సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఆయా గ్రామాల్లోని బ్యాంకు గోదాంలో సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. సభ్యులు తప్పనిసరిగా తమ పాస్‌బుక్స్‌తో హాజరై బోనస్ తీసుకోవాలని సూచించారు.