VZM: యూనియన్ బ్యాంక్ కంటోన్మెంట్ శాఖ వద్ద దసరా ఉత్సవాల సందర్భంగా కార్ కార్నివాల్ ఉత్సవాన్ని నిర్వహిస్తునట్లు బ్యాంకు మేనేజర్ మల్లేశ్వర రావు తెలిపారు. ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీరేట్లకు కార్ల ఋణాలను అందిస్తుందన్నారు. లబ్ధిదారులకు కొత్త కార్లను బ్యాంకు జనరల్ మేనేజర్ శాలిని మీనన్ చేతుల మీదుగా డెలివరీ చేయడం జరుగుతుందని తెలిపారు.