SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. అంతకుముందు కేతకి అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలతో అలంకరించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.