MNCL: పంటలలో తెగుళ్ళ నివారణకు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పురుగుమందులను పిచికారి చేయాలని ఆయన కోరారు.