AP: అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మీడియా పాయింట్ పైఅంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 14 వేల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పీకర్ వెల్లడించారు.