SRPT: నడిగూడెం మండలం రత్నవరంలో కోతులు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు వెంకటేష్ అనే వ్యక్తిపై కోతుల గుంపు దాడికి తెగబడింది. చెవిని కొరకడంతో సదరు వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు కోతులను తరిమికొట్టి వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.