RR: మియాపూర్ PS పరిధి నాగార్జున ఎన్ క్లేవ్‌లోని ఓ రీహాబిలిటేషన్ సెంటర్లో హత్య జరిగింది. డ్రగ్స్‌కు బానిసైన సందీప్ ఇక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే సెంటర్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన సులేమాన్, ఆదిల్‌తో గొడవ జరిగింది. ఇరువురు కలిసి సందీప్‌ను కొట్టి హత్య చేశారు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.