NZB: అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డెఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఎన్జీవోస్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంభాషణకు భాష అవసరమని, వినలేని, మాట్లాడలేని బధిరులకు సమాచారం అందించడానికి సంకేత భాష ఆవిర్భవించిందని వివరించారు.