చెన్నైలోని ఇంజంబక్కంలో ఉంటున్న నటుడు జయం రవి ఇల్లు వివాదంలో చిక్కుకుంది. ఆయన ఇంటికి సంబంధించిన రుణాలను చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఇంటికి నోటీసులు అంటించారు. రూ. 7.60 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఇంటిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. కాగా, ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఆయన స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.