VKB: తాండూరు – చించోళి జాతీయ రహదారి విస్తరణ భాగంగా కల్వర్టు నిర్మాణం చేపట్టారు. భారీ వర్షాలు కురిసి రోడ్డు బురదమయంగా మారింది. ఈ కారణంగా సిమెంట్ లోడుతో వెళ్తున్న వాహనం రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. దీంతో కర్ణాటకకు వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రోడ్డు పనులు తొందరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.