HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో LLM నాలుగో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎండ్ ఇంప్రూవ్మెంట్) అక్టోబర్ 9 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు నియంత్రణాధికారి ఇక్బాల్ బుధవారం తెలిపారు. అక్టోబర్ 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్ పరీక్షలు మ 2 నుంచి సా 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.