కృష్ణా: ఉరివి గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.