ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని వ్యాఖ్యానించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.