MBNR: కొత్త గంజి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.