NTR: దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మంచినీటి బాటిళ్లు పక్కదారి పడుతున్నాయి. వాటిని రవాణా చేసే వ్యక్తులు మార్గమధ్యంలోని దుకాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నీరు భక్తులకు చేరకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.