TG: హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలీంనగర్లో నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల భీకర వర్షం కరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.