E.G: నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మట్ట మంగరాజు మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.