ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. గ్రామాలలో 2 సెంట్లు, పట్టణాలలో 3 సెంట్లు అర్హులైన వారికి ఇంటి నివేశ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.