WGL: రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యానికి మంచి ధర లభించేందుకు రైస్ మిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండలం లోహిత గ్రామంలో ఏర్పాటు చేసిన మిల్టేక్ రైస్ మిల్ను ఎమ్మెల్యే ఈరోజు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇలాంటి పరిశ్రమలు ముందంజలో ఉండాలన్నారు.